టిఎస్‌ఆర్టీసీ బస్సులు... మహిళకు మాత్రమే!

December 11, 2023
img

కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో మహిళలకు మహాలక్ష్మి ఉచిత బస్సు పధకం ప్రవేశ పెట్టడంతో బస్సులన్నీ మహిళలతో కిటకిటలాడుతున్నాయి. కార్తీకమాసంలో నేడు చివరి ఆదివారం కావడంతో మహిళలు కీసరగుట్ట, వేములవాడ, కాళేశ్వరం తదితర ప్రసిద్ద శైవక్షేత్రాల దర్శనాలకు బయలుదేరారు. వారితో ఆర్టీసీ బస్సులు కిటకిటలాడుతున్నాయి. గత ఆదివారంతో పోలిస్తే ఈ ఆదివారం 15శాతం ఆకుపెన్సీ పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అది మహాలక్ష్మి పధకం ఎఫెక్ట్ అని వేరే చెప్పక్కరలేదు. నిజానికి ఏటా కార్తీక, శ్రావణ మాసాలలో  ప్రజలు పుణ్యక్షేత్రాలు దర్శించుకొనేందుకు వీలుగా టిఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపించి భారీగా ఆదాయం సమకూర్చుకొంటుంది. ఈసారి కూడా ప్రత్యేక బస్సులు నడిపిస్తోంది. కానీ మహాలక్ష్మి పధకం అమలులోకి వచ్చినందున వాటిలో 50%పైగా జీరో ఛార్జీ టికెట్లే ఉంటాయి. కనుక టిఎస్‌ఆర్టీసీకి మరింత నష్టమే తప్ప లాభం ఉండకపోవచ్చు. ఆర్టీసీ బస్సులు మహిళలతో నిండిపోతుండటంతో టికెట్‌ తీసుకొని ప్రయాణించే పురుషులకు చోటు లేకుండా పోతోంది. కనుక ఈవిదంగా కూడా టిఎస్‌ఆర్టీసీ నష్టపోయే ప్రమాదం కనిపిస్తోంది.          


Related Post