రైతులతో కేంద్రం మళ్ళీ చర్చలు...మళ్ళీ విఫలం

January 23, 2021
img

కేంద్రం తెచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై శుక్రవారం రైతు సంఘాల నేతలతో కేంద్రమంత్రులు మళ్ళీ చర్చలు జరిపారు. కేంద్ర ప్రభుత్వం తరఫున కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పీయూష్ గోయల్ పాల్గొన్నారు.

ఇప్పటివరకు పదిసార్లు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. శుక్రవారం 11వ సారి మళ్ళీ చర్చలు జరిగాయి కానీ మళ్ళీ విఫలం అయ్యాయి. అటు కేంద్రప్రభుత్వం కానీ, ఇటు రైతుసంఘాలు గానీ వెనక్కు తగ్గకపోవడంతో ఎన్నిసార్లు చర్చలు జరిగినా ఫలించడం లేదు. దాదాపు మూడు నెలలుగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో తమ నిరసనను తెలియజేస్తూనే ఉన్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయకుండా కేంద్రప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తోందని రైతు సంఘాలు ఆరోపిస్తుంటే, రైతులు కోరినట్లు చట్ట సవరణలు చేసేందుకు సిద్దమని చెపుతున్నా రైతులు రాజకీయపార్టీల ప్రభావంతో ఆందోళనలు కొనసాగిస్తున్నారని కేంద్రప్రభుత్వం ఆరోపిస్తోంది. నిన్న మళ్ళీ చర్చలు విఫలమైన తరువాత రైతు సంఘాల నేతలు మాట్లాడుతూ, కేంద్రం తెచ్చిన 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు నిరసనలు తెలియజేస్తామని తెలిపారు. 


Related Post