డా.రాజశేఖర్, జీవిత హెల్త్ బులెటిన్‌

October 24, 2020
img

తెలుగు సినీనటులు డాక్టర్ రాజశేఖర్, ఆయన భార్య జీవిత, వారి ఇద్దరు కుమార్తెలు ఇటీవల కరోనాబారిన పడగా కుమార్తెలు ఇద్దరూ త్వరగానే కోలుకొన్నారు. డా.రాజశేఖర్ మాత్రం ఇంకా హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారికి వైద్యం చేస్తున్న డాక్టర్ కృష్ణ వారి ఆరోగ్యపరిస్థితిని తెలియజేశారు. డా.రాజశేఖర్ ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్సకు ఆయన శరీరం చక్కగా స్పందిస్తోందని తెలిపారు. ఆయన భార్య జీవిత కూడా కోలుకొన్నారని ఈరోజు ఆమెకు కరోనా పరీక్ష చేయగా నెగెటివ్ అని రిపోర్ట్ వచ్చిందని కనుక ఆమెను ఇవాళ్ళ డిశ్చార్జ్ చేసామని తెలిపారు. తెలుగు సినీ నటులు చిరంజీవి, మోహన్ బాబు, తదితరులు డాక్టర్ రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. 


Related Post