ఏపీలో రోజుకి 10,000 పాజిటివ్ కేసులు

July 30, 2020
img

కరోనా పరీక్షల విషయంలో మొదటి నుంచి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పూర్తి భిన్నమైన వైఖరులు అవలంభిస్తున్నాయి. ఏపీలో మొదటి నుంచి చాలా ఉదృతంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తుంటే, తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు మొట్టికాయలు వేసేవరకు ఆగి కరోనా పరీక్షలు పెంచింది. కరోనా పరీక్షలు పెరుగుతున్నకొద్దీ పాజిటివ్ కేసులు పెరుగుతాయనే వాస్తవం ఏపీలో నిరూపితమవుతోంది కనుక ఇప్పుడు తెలంగాణలో కూడా కరోనా పరీక్షలు పెరిగితే భారీగా పాజిటివ్ కేసులు బయటపడే అవకాశం ఉంది. కానీ తెలంగాణ ప్రజలలో వ్యాధి నిరోధక శక్తి చాలా ఎక్కువగా ఉందనే తెలంగాణ ప్రభుత్వం వాదన నిజమైతే ఇక ముందు కూడా రాష్ట్రంలో పాజిటివ్ కేసులు కాస్త అటూ ఇటూగా ఇదే స్థాయిలో రోజుకు (1600-1800) ఉండాలి. అదే కనుక జరిగితే తెలంగాణ రాష్ట్రంలో కరోనా నుంచి అతి త్వరలోనే పూర్తిగా బయటపడుతుందని ఆశించవచ్చు.    

 ఏపీలో 24 గంటలలో 70,068 శాంపిల్స్ పరీక్షించగా 10, 167 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఇంత భారీగా కేసులు బయటపడుతున్నప్పటికీ విమర్శలు ఎదుర్కోవలసి వస్తుందని ఏమాత్రం భయపడకుండా ఏపీ ప్రభుత్వం రోజురోజుకీ మరింత భారీ స్థాయిలో కరోనా పరీక్షలు చేయిస్తోంది. అంతే కాదు...కరోనా పరీక్షలు, పాజిటివ్ కేసులు, మరణాలు సంఖ్యను ఏమాత్రం దాచిపెట్టకుండా చాలా పారదర్శకంగా హెల్త్ బులెటిన్లలో ప్రకటిస్తుండటంతో కరోనాను ఎదుర్కోవడంలో జగన్ ప్రభుత్వం శక్తివంచన లేకుండా చేయగలిగినంతా చేస్తోందనే అభిప్రాయం ప్రజలకు నమ్మకం కలుగుతోంది. కానీ కరోనాను కట్టడి చేయడంలో దేశానికే ఆదర్శంగా నిలిచామని గొప్పగా చెప్పుకొంటున్న తెలంగాణ ప్రభుత్వం నేటికీ సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటుండటం విశేషం. ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌ ప్రకారం 13 జిల్లాలలో కరోనా కేసుల వివరాలు ఈవిధంగా ఉన్నాయి: 

సంఖ్య

జిల్లా

గత 24 గంటలలో

చనిపోయినవారి సంఖ్య

మొత్తం మరణాల సంఖ్య

గత 24 గంటలలో

నమోదైన కేసులు

మొత్తం పాజిటివ్ కేసులు

మొత్తం యాక్టివ్ కేసులు

కోలుకొన్నవారి సంఖ్య

1

శ్రీకాకుళం

1

66

586

6168

2786

3316

2

విజయనగరం

4

55

214

3816

2062

1699

3

విశాఖపట్టణం

8

100

1223

9782

7351

2331

4

తూర్పుగోదావరి

9

157

1441

19,180

12,919

6,104

5

పశ్చిమగోదావరి

1

92

998

11,354

6658

4604

6

కృష్ణ

3

160

271

6530

1821

4549

7

గుంటూరు

9

121

946

13,762

5887

7754

8

ప్రకాశం

4

57

318

4761

2180

2524

9

కడప

6

42

753

7230

3526

3662

10

కర్నూలు

8

187

1252

15,723

7926

7610

11

నెల్లూరు

1

38

702

6455

4338

2079

12

చిత్తూరు

6

101

509

9589

4345

5143

13

అనంతపురం

8

105

954

13,312

7435

5772

 

ఇతర రాష్ట్రాల కేసులు

0

0

0

2461

16

2445

 

విదేశీ కేసులు

0

0

0

434

2

432

0

మొత్తం

68

1281

0

1,30,557

69,252

60,024

Related Post