నేటి నుంచి ప్రత్యేకరైళ్ళు ప్రారంభం

June 01, 2020
img

నేటి నుంచి దేశవ్యాప్తంగా 200 ప్రత్యేక రైళ్ళు ప్రారంభం అయ్యాయి. ఇవికాక ఇప్పటికే 30 రైళ్ళు తిరుగుతున్న సంగతి తెలిసిందే. కనుక దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన రైల్వేస్టేషన్ల చాలా రోజుల తరువాత మళ్ళీ ఇవాళ్ళ ప్రయాణికులతో కళకళలాడుతున్నాయి. అయితే ప్రయాణానికి గంటన్నర ముందు రైల్వేస్టేషన్‌కు చేరుకొని ధర్మల్స్ స్కానింగ్ చేయించుకోవాలని షరతు విధించినందున ప్రయాణికులు ముందే స్టేషన్లకు చేరుకొని బారులు తీరారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్ బయట సుమారు కిమీ పొడవునా ప్రయాణికులు బారులు తీరారు.

కన్ఫర్మ్ టికెట్స్ ఉన్నప్పటికీ స్టేషన్ల వద్ద ధర్మల్ పరీక్షలలో జ్వరం లేదా కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తిస్తే ప్రయాణానికి అనుమతించరు. ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరిన తరువాత కూడా మళ్ళీ ధర్మల్ పరీక్షలు చేయించుకోవలసి ఉంటుంది. ఆయా రాష్ట్రాలలో అమలుచేస్తున్న నిబందనల ప్రకారం అవసరమైతే క్వారెంటైన్‌కు వెళ్లవలసి ఉంటుంది. మరికొన్ని రోజుల వరకు రైళ్లలో మంచినీళ్ళు, ఆహారం వగైరాలు అమ్మబడవు. కనుక ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులు గమ్యస్థానం చేరేవరకు అవసరమైన నీళ్ళు, ఆహారం వెంటతెచ్చుకోవలసి ఉంటుంది. ఈ నిబందనలకు సిద్దపడినవారే ప్రయాణం పెట్టుకోవడం మంచిది లేకుంటే ఈ రైలు ప్రయాణాలు చేదు అనుభవాలు ఎదుర్కోవలసి వస్తుంది.

Related Post