చిట్యాలలో రోడ్డు ప్రమాదం.. వియ్యంకులు మృతి

February 14, 2020
img

నల్గొండ జిల్లా చిట్యాలలో ఆర్టీసీ బస్సు బైక్‌ను డ్డీ కొనడంతో దానిపై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు ఘటనాస్థలంలోనే మృతి చెందారు. పోలీసుల సమాచారం ప్రకారం చనిపోయిన బిక్షపతి (60), నర్సింహ (58) ఇద్దరూ వియ్యంకులు. రంగారెడ్డి జిల్లా చౌటుప్పల్‌ మండలం దండు మల్కాపురం గ్రామానికి చెందిన భిక్షపతి, మంచాల మండలం చెన్నారెడ్డిగూడెం గ్రామానికి చెందిన నర్సింహ ఇద్దరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి రామన్నపేట మండలం లక్ష్మాపురంలో ఒక పెళ్ళికి హాజరయ్యారు. అనంతరం తమ మిత్రుడైన ఆనంద్ బైక్‌పై ముగ్గురూ తిరుగు ప్రయాణం అయ్యారు. వారి వాహనం చిట్యాల రైల్వేస్టేషన్‌ రోడ్డులో జాతీయరహదారిని దాటుతుండగా ఆర్టీసీ బస్సు డ్డీకొంది. ఈ ప్రమాదంలో వియ్యంకులైన భిక్షపతి, నర్సింహ ఇద్దరూ ఘటన స్థలంలోనే చనిపోగా వారి స్నేహితుడు ఆనంద్ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అంతవరకు పెళ్ళి కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న వియ్యంకులు ఇరువురూ మరణించారనే వార్త తెలిసి ఇరు కుటుంబాలు వారి బందుమిత్రులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. 


Related Post