మేడారం హుండీల లెక్కింపు షురూ

February 12, 2020
img

ఈ నెల 8వరకు సాగిన మేడారం మహాజాతరకు సుమారు కోటిమందికిపైగా భక్తులు వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు. సమ్మక్క సారలమ్మలకు భక్తులు సమర్పించిన హుండీ కానుకల లెక్కింపు కార్యక్రమం నేటి నుంచి మొదలైంది. మొత్తం 494 హుండీలను హన్మకొండలోని టీటీడీ కళ్యాణమండపానికి చేర్చి అక్కడ పోలీసులు, సీసీ కెమెరాల పహారాలో లెక్కిస్తున్నారు. మేడారం ఆలయ ఈవో రాజేంద్ర అధ్యర్యంలో హుండీ సొమ్ము లెక్కింపు జరుగుతోంది. దేవాదాయశాఖకు చెందిన మొత్తం 200 మంది హుండీ కానుకలను లెక్కిస్తున్నారు. రెండేళ్ళ క్రితం జరిగిన మేడారం జాతరలో హుండీల ద్వారా రూ.10 కోట్లు ఆదాయం వచ్చిందని, ఈసారి ఇంకా ఎక్కువ రావచ్చని భావిస్తున్నామని ఈవో రాజేంద్ర చెప్పారు. హుండీ కానుకల లెక్కింపు పూర్తవడానికి సుమారు వారం రోజులు పట్టవచ్చునని తెలుస్తోంది.


Related Post