త్వరలో సానియా మీర్జా చెల్లెలి పెళ్ళి

October 07, 2019
img

భారత్‌ టెన్నిస్ స్టార్ట్ ప్లేయర్ సానియా మీర్జా చెల్లెలు ఆనం మీర్జా త్వరలో పెళ్ళి చేసుకోబోతోంది. టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజరుద్దీన్ కుమారుడు అసద్‌, ఆనం మీర్జా గత కొంతకాలంగా చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ తమ ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతున్నారు. వారి ప్రేమకు ఇరుకుటుంబాల పెద్దలు అంగీకారం తెలుపడంతో త్వరలోనే వారి వివాహం జరుగనుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో ‘కాబోయే వదువు’ అనే క్యాప్షన్‌తో తన ఫోటోను పెట్టి తెలియజేసింది. ఈ ఏడాది డిసెంబరులో వారి వివాహం జరుగనున్నట్లు తెలుస్తోంది. అసద్ న్యాయవాదిగా పనిచేస్తుండగా, ఆనం మీర్జా హైదరాబాద్‌లో ‘లబల్ బజార్’ పేరిట ఫ్యాషన్ షాప్ నిర్వహిస్తోంది.             


Related Post