ట్యాంక్‌బండ్‌ వద్ద తృటిలో తప్పిన ప్రమాదం

September 12, 2019
img

ఈరోజు హుస్సేన్ సాగర్‌ వద్ద తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రతీసారిలాగే ఈసారి కూడా ఖైరతాబాద్‌ గణేశుని నిమజ్జనం చూసేందుకు నగరం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చారు. ఖైరతాబాద్‌ గణేశుని నిమజ్జనం కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన 6వ నెంబర్ క్రేన్ ఉన్న ప్రాంతంలో అధికసంఖ్యలో జనం గుమిగూడారు. వినాయకుని నిమజ్జనం చేసే సమయానికి ఆ ప్రదేశమంతా కిక్కిరిసిపోయింది. దాంతో చిన్నగా తోపులాటలు జరుగగా ఒడ్డువైపు ఉన్నవారిలో నలుగురు వ్యక్తులు బారికేడ్లపై నుంచి హుస్సేన్‌సాగర్‌ నీళ్ళలో పడిపోయారు. కానీ అదృష్టవశాత్తు అక్కడే నిమజ్జనం కోసం సిద్దంగా ఉన్న గజఈతగాళ్ళు వెంటనే అక్కడకు చేరుకొని వారిని మళ్ళీ గట్టుపైకి ఎక్కించడంతో ప్రమాదం తప్పింది. అక్కడే ఉన్న పోలీసులు కూడా జనాలను అదుపుచేయడంతో తోపులాటలు, త్రొక్కిసలాటలు జరుగకుండా నివారించగలిగారు. ఆ తరువాత భక్తుల జేజే ద్వానాల మద్య ఖైరతాబాద్‌ గణేశ్ నిమజ్జనం చాలా ప్రశాంతంగా జరిగిపోయింది. 


Related Post