చాగంటివారు చెప్పిన ఓ మంచి మాట

March 16, 2019
img
చాగంటి వారి ప్రవచనాలలో దేవుడు, భక్తి, పూజలు వంటి ఆధ్యాత్మిక అంశాలు ఎక్కువగా ఉంటాయనే సంగతి అందరికీ తెలుసు. కానీ ఆధ్యాత్మికతతో పాటు ఆయన మనుషుల జీవన విధానం ఏవిధంగా ఉండాలనేది కూడా చాలా చక్కగా  భోదిస్తుంటారు. 
మనుషులకు, జంతువులకు కూడా నాలుక ఉంటుంది. జంతువులు తమ నాలుకను ఆహారం తినడానికి ప్రధానంగా ఉపయోగిస్తే, మనుషులు ఆహారం తినడంతో పాటు మాట్లాడేందుకు కూడా దానిని వినియోగిస్తుంటారు కనుక ఆ మాటల ద్వారానే మనిషి వ్యక్తిత్వం బయటపడుతుంది. ఆ మాటలతోనే మనుషులకు శత్రువులు, మిత్రులు ఏర్పడుతుంటారు. కనుక ప్రతీ మనిషి తన నాలుకను అదుపులో పెట్టుకోవడం చాలా అవసరం. అదే విషయాన్ని చాగంటివారు చిన్న పిల్లలకు సైతం అర్ధమయ్యే  విధంగా చాలా చక్కగా ఈ వీడియోలో వివరించారు. మీరూ ఓసారి చూడండి ఆయన చెప్పింది నిజమేనని తప్పకుండా అంగీకరిస్తారు.


Related Post