పుల్వామా ఎఫెక్ట్: నలుగురు విద్యార్ధులపై వేటు

February 17, 2019
img

పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు దేశ ప్రజలు అశ్రునాయనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తూ తీవ్ర ఆవేదన చెందుతుంటే, మరోపక్క దేశంలో కొందరు పాక్ సానుభూతిపరులు పుల్వామా దాడిపై రాక్షసానందం పొందుతూ దానిని సోషల్ మీడియాలో కూడా వ్యక్తం చేస్తున్నారు. రాజస్థాన్ లోని నీమ్స్ యూనివర్సిటీకి చెందిన నలుగురు విద్యార్ధులు అదేవిధంగా చేయడంతో వారిని సస్పెండ్ చేస్తున్నట్లు యూనివర్సిటీ ప్రకటించింది. యూనివర్సిటీలో బి.ఎస్స్సీ (రెండవ సంవత్సరం) విద్యార్ధులైన కుమారి తల్వీన్ మంజూర్, కుమారి ఇక్రా, కుమారి జొహ్రా నజీర్, కుమారి ఉజ్మా నాజిర్ అనే నలుగురు విద్యార్ధినులు పుల్వామా దాడిపై సంతోషం వ్యక్తం చేస్తూ వాట్సాప్‌ గ్రూపులలో మెసేజులు పోస్ట్ చేసి దేశవ్యతిరేకత ప్రదర్శించినందుకు ఈ నిర్ణయం తీసుకొన్నట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ తెలియజేశారు.

Related Post