నిన్న నీటిలో... నేడు నింగిలో... బతుకమ్మ పండుగ

October 17, 2018
img

బతుకమ్మ పండుగ ప్రతీ ఏడాది సరికొత్త రూపాలలో ఆవిష్కృతం అవుతోంది. ఈసారి బతుకమ్మ వేడుకలలో ప్రత్యేకత ఏమిటంటే, హైదారాబాద్ నగరంలో హుస్సేన్ సాగర్ నీళ్ళపై అందంగా అలంకరించిన తొట్టెలలో నిలబడి మహిళలు బతుకమ్మ ఆడటం. మంగళవారం సాయంత్రం ట్యాంక్ బండ్ వద్ద వేలాది మండి ప్రజలు చూస్తుండగా 100 మండి సెయిలర్లు తొట్టెలలో నిలబడి బతుకమ్మ ఆడారు. 

బుదవారం సాయంత్రం ట్యాంక్ బండ్ వద్ద హుస్సేన్ సాగర్ నీటిపై సుమారు 80-100 అడుగుల ఎత్తులో గాలిలో తేలియాడే హాట్ ఎయిర్ బెలూనులో శిక్షణ పొందిన మహిళలు బతుక్కమ్మ ఆడబోతున్నారని రాష్ట్ర పర్యాటకశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. వచ్చే ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ జిల్లాలలో బతుకమ్మ పుట్టీల (తొట్టెలు) పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాల వలన జాతీయ అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించవచ్చునని బుర్రా వెంకటేశం తెలిపారు.


Related Post