చిరు అన్నని ఒప్పించడం కష్టమే గానీ ఒప్పుకుంటే... సాయి కుమార్‌

February 11, 2024
img

ప్రముఖ నటుడు, ఎంతో మంది ప్రముఖ నటులకు డబ్బింగ్ చెప్పిన డబ్బింగ్ ఆర్టిస్ సాయి కుమార్‌ చేసిన ‘పోలీస్ స్టోరీ’ సినిమా 1996లో విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత ఆయన వెనక్కు తిరిగి చూసుకోలేదు. మొదట కన్నడలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన ఆ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నప్పుడు తాను ఎదుర్కొన్న అనుభవాలను ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ ఎన్టీవీకి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో సాయి కుమార్‌ వెల్లడించారు. 

ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవికి ఆ సినిమా ప్రీమియర్ షో చూపించి, దాని గురించి ఆయన చేత మీడియాకు నాలుగు మంచి ముక్కలు చెప్పించేందుకు సాయి కుమార్‌ పడిన తిప్పల గురించి విన్నప్పుడు ‘సినిమా కష్టాలు’ అంటే ఇవేనేమో అనిపిస్తుంది. 

ఓ సినిమా తీయడం, దానిని థియేటర్లలో విడుదల చేసుకోవడం, దానిని హిట్ చేసుకునేందుకు దర్శక నిర్మాతలు, నటీనటులు ఎంతగా శ్రమిస్తారో సాయి కుమార్‌ తాజా ఇంటర్వ్యూ చూస్తే అర్దమవుతుంది. 

కన్నడలో సూపర్ హిట్ అయిన పోలీస్ స్టోరీ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నప్పుడు ఆ సినిమా చూసి బాగుందని మీడియాకు చెప్పాలని తాను చిరంజీవిని అడిగానని, మొదట ‘నో’ అన్నప్పటికీ చివరికి ఒప్పుకున్నారని సాయి కుమార్‌ చెప్పారు. 

చిరంజీవిని ఒప్పించడం చాలా కష్టం కానీ ఒకసారి ఒప్పుకుంటే మాట తప్పారని సాయి కుమార్‌ చెప్పారు. ‘హిట్లర్’ సినిమా షూటింగ్‌ చేస్తూ మద్యలో వచ్చి తన పోలీస్ స్టోరీ సినిమా చూసి తనను ఎంతో మెచ్చుకున్నారని సాయి కుమార్‌ చెప్పారు. 

పోలీస్ స్టోరీ సినిమాని ఓ థియేటర్లో చిరంజీవి, పరుచూరి బ్రదర్స్ తదితరులు చూస్తున్నప్పుడు, అదే సమయంలో వేరే థియేటర్‌కి ఆ సినిమా రీల్స్ అందించడం కోసం సాయి కుమార్‌ ఎంతగా శ్రమించారో ఆయన మాటలలోనే... 

వీడియో ఎన్టీవీ సౌజన్యంతో....     

Related Post