ఎవరో భుజాలు తడుముకుంటే నేనేం చేయగలను?

February 09, 2024
img

ప్రముఖ నిర్మాత, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ అధినేత టీజీ విశ్వప్రసాద్ మొన్న సినీ నిర్మాణంలో ఉన్నవారు ఏవిదంగా అవినీతికి పాల్పడుతున్నారో చెప్పారు. తమ సంస్థలో కొందరు అవినీతికి పాల్పడినందున వారిపై చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.

ఆయన చేసిన ఈ వ్యాఖ్యలకు కొందరు స్పందిస్తూ సినీ కార్మికులను, వారి యూనియన్లను అవమానిస్తున్నారంటూ ఘాటుగా విమర్శలు గుప్పిస్తున్నారు.

వాటికీ ఆయన మళ్ళీ సమాధానం చెపుతూ, “నేను మా సంస్థలో కొందరు అవినీతికి పాల్పడ్డారని, వారి వలన నా సినిమాలలో పనిచేసే సినీ కార్మికులు నష్టపోయారని మాత్రమే చెప్పాను. నేను చెప్పిన విషయాలు విని ఎవరో భుజాలు తడుముకొంటే నేనేం చేయగలను.

సినీ కార్మికులను, యూనియన్ నేతలను నేను అవమానించలేదు. అవినీతికి పాల్పడినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ అలా చేస్తే వారి కుటుంబాలు రోడ్డున పడతాయని భావించి, వారిని ఉద్యోగాలలో నుంచి తొలగించి బయటకు పంపాము.

ఇది మా సంస్థ అంతర్గత వ్యవహారం. దీనిలో బయటవారికి జోక్యం చేసుకునే హక్కు, అధికారం లేవు. మేము ఎవరికీ అన్యాయం చేయలేదు. చేశామని భావిస్తే ఫిలిమ్ ఛాంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు.

మేము చాలా ఇష్టంతోనే సినిమాలు తీయాలని వచ్చాము తప్ప ఎవరినో దోచుకుని బాగుపడాలని కాదు....” అంటూ టీజీ విశ్వప్రసాద్ ట్విట్టర్‌లో ఓ పెద్ద లేఖ పోస్ట్ చేశారు. 

Related Post