హనుమాన్‌... బాక్సాఫీసుని బద్దలు కొడుతున్నాడుగా!

February 06, 2024
img

యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ, యువనటుడు తేజా సజ్జాల ‘హనుమాన్‌’ సినిమా జనవరి 12న రిలీజ్ అయ్యి పెద్ద సినిమాలకు గట్టి పోటీ ఇచ్చింది. కేవలం రూ.45 కోట్ల బడ్జెట్‌తో తీసిన హనుమాన్ 25 రోజులలో రూ.300 కోట్లు కలెక్షన్స్ సాధించి బాక్సాఫీస్ బద్దలు కొడుతోంది.

సినిమాలకు ఎంత బడ్జెట్‌ అని కాకుండా ప్రేక్షకులను మెప్పించేలా సినిమా తీయడం ఎంత అవసరమో ప్రశాంత్ వర్మ ఈ సినిమాతో నిరూపించి చూపాడు. కనుక సినీ పరిశ్రమలో పెద్ద  నిర్మాతలు, స్టార్ హీరోలు, డైరెక్టర్లకు ఇది కనువిప్పు కలిగిస్తే చక్కటి సినిమాలు అందించగలుగుతారు. 

మొదట థియేటర్లు దొరక్క ఇబ్బంది పడిన ‘హనుమాన్‌’ రూ.300 కోట్లు కలెక్షన్స్ సాధించడం, అదీ... 25 రోజులలోనే సాధించడం చాలా గొప్ప విషయమే. ఈ సందర్భంగా ప్రశాంత్ వర్మ మరో కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

అయోధ్య రామ మందిరంలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ట జరుగుతున్నప్పుడే ప్రశాంత్ వర్మ తన తర్వాత సినిమా పేరు ‘జై హనుమాన్‌’ అని ప్రకటించాడు. ఈ సినిమా స్క్రిప్ట్ కూడా సిద్దమైంది కనుక ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి.

Related Post