ఉక్రెయిన్ మిలటరీ కూడా నాటు నాటే!

May 30, 2023
img

ఆర్ఆర్ఆర్‌ సినిమాలో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ రావడం గొప్ప గౌరవమైతే, ఆ పాటను అనేక దేశాల ప్రజలు ఆస్వాదిస్తూ డ్యాన్స్ చేస్తుండటం ఎంతో సంతోషం కలిగిస్తుంది. ఉక్రెయిన్ దేశంపై రష్యా సేనలు విరుచుకుపడక మునుపు ఆ దేశాధ్యక్షుడి అధికార నివాసం ముందు ఈ నాటునాటు పాటను చిత్రీకరించిన సంగతి తెలిసిందే. అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన అధ్యక్ష భవనం ముందు ఈ పాటను చిత్రీకరించడానికి అనుమతించడం కూడా మరో గౌరవం.

ఇక ఈ పాటకు ఆస్కార్ అవార్డు అందుకొనే సమయంలో ఈ పాట పదేపదే అన్ని దేశాలలో ప్రదర్శించబడటం కూడా గొప్ప గౌరవమే. ఆవిదంగా ఉక్రెయిన్ అధ్యక్ష భవనాన్ని యావత్ ప్రపంచదేశాలు చూడగలగటం వారికీ సంతోషం కలిగించేదే.

ఇంతకీ విషయం ఏమిటంటే, ఉక్రెయిన్ మిలటరీలోని మైకోలైవ్ దళం ఈ పాటకు తమ భాషలో పేరడీ కట్టి, మిలటరీ బ్యాండ్ ఆలపిస్తే, ఇద్దరు ఉక్రెయిన్ జవాన్లు ఈ పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేశారు. ఓ తెలుగు పాటను సొంతం చేసుకొని తమ భాషలో మార్చుకొని పాడుకోవడం కూడా ఆస్కార్ కంటే గొప్ప అవార్డు అనుకోవచ్చు. మన తెలుగు పాటతో ఇంతమందికి గౌరవం, గుర్తింపు లభించడం తెలుగు వారందరికీ గర్వకారణమే కదా?మన పాటను వారు ఆస్వాదిస్తున్నప్పుడు ఉక్రెయిన్ భాషలో మన నాటునాటు పాటని, వారి డ్యాన్స్ మనమూ చూసి ఆనందించాల్సిందే. 

Related Post