ఏలేలో ఏలేలో ... శాకుంతలం మూడో పాట మృదు మదురం

February 01, 2023
img

శాకుంతలం సినిమా నుంచి మరో మృదుమదూరమైన పాట నేడు విడుదలైంది. ఈ సినిమాలో మల్లికా మల్లికా... అనే అద్భుతమైన పాటని వ్రాసిన చైతన్య ప్రసాదే చిన్న చిన్న పదాలతో ఏలేలో ఏలేలో...”  అంటూ సాగే ఈ పాటని కూడా వ్రాశారు. కీరవాణి అద్భుతంగా స్వరపరిచిన ఈ పాటని అనురాగ్ కులకర్ణి బృందం మధురాతి మధురంగా ఆలపించింది. టిప్స్ ఆడియో సంస్థ ఈరోజు విడుదల చేసిన ఈ లిరికల్ వీడియో సాంగ్‌ని చూస్తే మీరు అంగీకరిస్తారు. గర్భవతి అయిన శకుంతల తన భర్త దుష్యంత మహారాజుని కలుసుకొనేందుకు పడవలో వెళుతున్నప్పుడు వచ్చే నేపద్యగీతం ఇది. చాలా మృదుమదురంగా, సాహిత్యపరంగా కూడా చాలా బాగుంది.        

ఈ సినిమాలో మలయాళ నటుడు దేవ్ మోహన్‌ దుష్యంత మహారాజుగా నటిస్తున్నాడు. శకుంతల,దుష్యంతుల పౌరాణిక ప్రేమ గాధ ఆధారంగా నిర్మింపబడుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్‌ కుమార్తె అర్హ చిన్నారి భరతుడిగా కనిపించబోతోంది. ఈ సినిమాలో మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, గౌతమి, అదితి బాలన్, అనన్య తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.

దిల్‌రాజు సమర్పణలో శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ నీలిమ గుణ ఈ సినిమాను గుణా టీం వర్క్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాను కూడా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చురుకుగా జరుగుతున్నాయి. ఫిభ్రవరి 17వ తేదీన శాకుంతలం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.


Related Post