ఆ నిర్మాత నా జీవితాన్ని నాశనం చేశాడు: ఆశా షైనీ

February 01, 2023
img

అనేక తెలుగు సినిమాలలో హీరోయిన్‌గా నటించిన ఆశా షైనీ అతి తక్కువ కాలంలో తన కెరీర్‌లో ఎంత ఎత్తుకు ఎదిగిందో, అంతే వేగంగా పాతాళానికి పడిపోయింది. ఇందుకు కారణం ఓ నిర్మాతని నమ్మి ప్రేమలో పడటమే అని ఆమె తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ పెట్టింది. ఇరవై ఏళ్ళ వయసులోనే పది సినిమాలలో నటించి కెరీర్‌లో చాలా ఉన్నతస్థాయికి ఎదిగానని,  అనేకమంది పేరొందిన డిజైనర్లకి మోడల్‌గా కూడా పనిచేసి ఎంతో మంచిపేరు సంపాదించుకొన్నానని ఆశా షైనీ దానిలో పేర్కొంది. కానీ ఆ వయసులో ఓ నిర్మాతతో ప్రేమలో పడి తప్పటడుగు వేసి తన కెరీర్‌ని చేజేతులా నాశనం చేసుకొన్నానని ఆమె పేర్కొంది.

మొదట్లో ఆ నిర్మాత బాగానే చూసుకొన్నప్పటికీ కొద్ది రోజులకే అతని అసలు రూపం బయటపడిందని ఆశా షైనీ పేర్కొంది. ప్రతీరోజు తిడుతూ, కొడుతూ తనని మానసికంగా, శారీరికంగా నరకం చూపాడని ఆశా షైనీ పేర్కొంది. అతను అనేకసార్లు తన కడుపు, మొహం, చివరికి మర్మావయాలపై కొట్టేవాడని పేర్కొంది. తాను బయటకి వెళ్ళి ఎవరినీ కలవనీయకుండా, మాట్లాడనీయకుండా అడ్డుపడేవాడని పేర్కొంది. సుమారు 14 నెలల పాటు అతని చేతిలో నరకం అనుభవించిన తర్వాత ఓ రోజు తప్పించుకొని పారిపోయి అమ్మనాన్నల వద్దకు చేరుకొన్నానని ఇప్పుడు వాళ్లతోనే ఉంటున్నానని తెలిపింది. ఆ బాధ, ఆవేదన, గాయాల నుంచి తేరుకోవడానికి చాలా సమయమే పట్టింది. ఇప్పుడు పూర్తిగా తేరుకొన్నాక మళ్ళీ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చానని పేర్కొంది. ఇప్పుడు మళ్ళీ ఫ్రేమలో పడ్డానని తెలిపింది. త్వరలో కొత్త బంధంలోకి అడుగుపెట్టబోతున్న నాకు మీ అందరి ఆశీర్వాదాలు కావాలి,” అంటూ ఆశా షైనీ అభిమానులకి విజ్ఞప్తి చేసింది. ఆ నిర్మాత చేతిలో గాయపడినప్పుడు తీసుకొన్న ఓ ఫోటోని, తాజా ఫోటోని కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆశా షైనీ పోస్ట్ చేసింది.  


Related Post