ఆర్ఆర్ఆర్‌కి గోల్డెన్ టొమేటో అవార్డ్!

January 31, 2023
img

ఆస్కార్ అవార్డుల బరిలో ఉన్న ఆర్ఆర్ఆర్‌ సినిమాకి అమెరికాలోని చాలా పేరొందిన రోటెన్ టొమేటోస్ అనే వెబ్‌సైట్‌ ‘గోల్డెన్ టొమేటో’ అవార్డు లభించింది. మనదేశంలో వివిద భాషల్లో అనేక వెబ్‌సైట్స్ ఉన్నాయి. అవన్నీ సినిమాలని విశ్లేషించి రివ్యూలు వ్రాసి రేటింగ్స్ ఇస్తుంటాయి. కానీ ఈ 'రోటెన్ టొమేటోస్' వెబ్‌సైట్‌ ప్రత్యేకత ఏమిటంటే దీనిలో నెటిజన్స్ ప్రతీ సినిమాపై విశ్లేషణ చేస్తుంటారు. వెబ్‌సైట్‌లో ఓటింగ్ నిర్వహించి వాటి ఆధారంగా సినిమాలకి ర్యాంకింగ్స్ ఇస్తుంటుంది. కనుక ఆర్ఆర్ఆర్‌ సినిమాపై కూడా రోటెన్ టొమేటోస్ నెటిజన్స్ ఓటింగ్ ఆధారంగా ఆర్ఆర్ఆర్‌ సినిమా నంబర్:1 స్థానంలో నిలవడంతో గోల్డెన్ టొమేటో అవార్డ్ ఇస్తున్నట్లు ప్రకటించింది. 

ఇంకో విశేషమేమిటంటే, ఆస్కార్ నామినేషన్స్‌లో నంబర్:1 స్థానంలో నిలిచిన ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ హాలీవుడ్ మూవీ ఈ రోటెన్ టొమేటోస్ వెబ్‌సైట్‌ ఓటింగులో మూడో స్థానంలో నిలువగా, ఆస్కార్ బరిలో రెండో స్థానంలో ఉన్న టామ్ క్రూజ్ నటించిన టాప్ గన్‌: మావరిక్ సినిమా రోటెన్ టోమెటోలో కూడా రెండో స్థానంలో నిలిచింది.

ఆస్కార్ బరిలో 3వ స్థానంలో ఉన్న అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా ఈ వెబ్‌సైట్‌లో 5వ స్థానంలో నిలవగా, ‘ద బ్యాట్ మ్యాన్’ సినిమా ఈ వెబ్‌సైట్‌లో 4వ స్థానంలో నిలవడం విశేషం. 

ఇక ఆస్కార్ బరిలో ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ 11 నామినేషన్స్‌తో అగ్రస్థానంలో నిలువగా, దాని తర్వాత టాప్ గన్‌: మావరిక్ సినిమా6 నామినేషన్స్‌తో రెండో స్థానంలో నిలుస్తోంది. వాటి తర్వాత స్థానంలో అవతార్ ఉంది. ఆర్ఆర్ఆర్‌ సినిమా వివిద విభాగాలలో ఆస్కార్ అవార్డు కోసం పోటీ పడినప్పట్టికీ ఈ సినిమాలో ‘నాటునాటు పాట’ ఒక్కటే బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌ విభాగంలో పోటీలో నిలిచి ఉంది. మార్చి 12వ తేదీన లాస్ ఏంజలీస్‌లో గల డల్బీ థియేటర్‌లో ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం జరుగుతుంది. 


Related Post