ప్రపంచ ప్రసిద్ధి చెందిన అమెరికన్ కంపెనీ టెస్లా కార్లు భారత్‌లోకి వచ్చేశాయి. అవి ముంబాయి, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ వంటి మహానగరాలలో రోడ్లపై కనిపిస్తేనే ప్రజలు ఆశ్చర్యంతో చూస్తుంటారు. అటువంటిది ఏపీలో కోనసీమ జిల్లాలో అమలాపురం రోడ్డుపై కనిపిస్తే?ప్రముఖ పారిశ్రామికవేత్త ఆదిత్య రామ్ సంక్రాంతి పండుగకు ఈసారి కొనసీన జిల్లాలో అమలాపురంకు తన టెస్లా కారులో వచ్చారు. భారతీయ కార్ల డిజైన్లకు పూర్తి భిన్నంగా హాలీవుడ్ సినిమాలలో కనిపించేటు వంటి ఆ కారుని చూసేందుకు ప్రజలు క్యూకట్టారు. వారి అభ్యర్ధన మేరకు ఆదిత్య రామ్ ఆ కారుతో వారు సెల్ఫీలు దిగేందుకు అనుమతించారు.
భారత్‌లో లభిస్తున్న ఈ టెస్లా బేసిక్ మోడల్ వైసీపీ ఖరీదు సుమారు 60 లక్షలు. దీనిలో ఎస్/ఎక్స్‌ప్రెస్ మోడల్ ఖరీదు రూ.1.5 కోట్లు నుంచి 1.8 కోట్లు వరకు ఉంటుంది.
అత్యాధునిక ఫీచర్స్, సౌకర్యాలు కలిగిన ఈ టెస్లా వై మోడల్ కారు, మొబైల్ ఫోనులాగే ఆటోమేటిక్‌గా సాఫ్ట్ వేర్ అప్‌డేట్ అవుతుంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్, అత్యంత భద్రత, అత్యంత సౌకర్యవంతమైన ప్రయాణం వంటివి మామూలే!