వాళ్ళు రొమాన్స్ ఆగదు... ఆవిడ ట్వీట్లూ ఆగవు!

September 05, 2025
img

ఇది సమంత, బాలీవుడ్‌ డైరెక్టర్ రాజ్ నిడిమోరు ప్రేమాయణం గురించి. గత కొంతకాలంగా వారిద్దరూ చెట్టాపట్టాలు వేసుకొని ప్రేమ పక్షుల్లా తిరుగుతున్నారు. తమ మద్య బంధం ఉందని నోటితో చెప్పడం లేదు కానీ ఫోటోలు, వీడియోలతో తరచూ చెపుతూనే ఉన్నారు. కొన్ని రోజుల క్రితం ఇద్దరూ కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇప్పుడు ఇద్దరూ కలిసి లండన్, ఆ తర్వాత దుబాయ్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. సమంత ఎప్పటికప్పుడు తమ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులతో పంచుకుంటూనే ఉంది. కనుక రాజ్ నిడిమోరు భార్య శామలి డే కూడా వాటిని చూసి స్పందిస్తూనే ఉన్నారు.  

వారి తాజా ఫోటోలపై ఆమె స్పందిస్తూ, “తెలివితక్కువగా ప్రవర్తించదానికి కూడా కాస్త తెలివిగా స్పందించండి. నిష్పాక్షికత అంటే ఇక్కడ మీరు ఏదీ సొంతం చేసుకోకూడదు. అలాగే ఏదీ కూడా మిమ్మల్ని సొంతం చేసుకోకూడదు,” అంటూ కొటేషన్స్ పెట్టారు. 

రాజ్ నిడిమోరు, శామలి 2015లో పెళ్ళి చేసుకున్నారు. కొన్నేళ్ళ తర్వాత విభేదాలు రావడంతో వేర్వేరుగా ఉంటున్నారు. ఇక సమంత, నాగచైతన్య 2021లో పరస్పర అంగీకారంతో విడిపోయారు. ఆ తర్వాత నాగ చైతన్య శోభితా దూళిపాళని గత ఏడాది పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే.


Related Post