ఎస్ఎల్‌బీసీ టన్నల్‌లో సరే.. సిగాచిలో కూడానా?

July 04, 2025
img

సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ శిధిలాలలో మృతదేహాల కోసం ఇంకా గాలింపు కొనసాగుతూనే ఉంది. మరోపక్క ఫ్యాక్టరీ గేటు వద్ద వారి కుటుంబ సభ్యులు, బందువులు మృతదేహాల కోసం ఎదురుచూపులు చూస్తూనే ఉన్నారు. 

ఈ ప్రమాదంలో మొత్తం 39 మంది చనిపోయారని వారిలో 31 మందిని గుర్తించామని మరో 8 మృతదేహాలను గుర్తించాల్సి ఉందని జిల్లా కలెక్టర్ చెప్పారు. మరో 61 మంది ప్రాణాలతో బయటపడ్డారు. వారిలో 23 మంది ఇంకా ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా 12 మంది డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు. మరో 9 మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉందని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య చెప్పారు.    

పటాన్‌చెరు ప్రభుత్వాస్పత్రి మార్చురీలో ఉన్న 8 మృతదేహాలణు గుర్తించాలంటే వారి కుటుంబ సభ్యుల డీఎన్ఏలు అవసరం. అయితే సిగాచి యాజమాన్యం మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు చొప్పున పరిహారం చెల్లిస్తామని ప్రకటించడంతో, ఆ సొమ్ము దక్కించుకోవాలనే ఆశతో యూపీ, బీహార్ రాష్ట్రాల నుంచి మృతుల బందువులమని చెప్పుకుంటూ పలువురు వచ్చి డ్రామాలు చేస్తుండటంతో మృతులను గుర్తించడం కష్టంగా మారినట్లు తెలుస్తోంది. 

ఏది ఏమైనప్పటికీ, ప్రమాదం జరిగి వారం రోజులవుతున్నా ఇంతవరకు మృత దేహాలను అప్పగించలేకపోవడం, ఆచూకీ కనుగొనలేకపోవడంతో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. 

ఎస్ఎల్‌బీసీ టన్నల్‌లో కాంక్రీట్ కింద కూరుకుపోయి చనిపోయిన వారిని ఎలాగూ బయటకు తీసి బంధువులకు అప్పగించలేకపోయారు సరే.. నగరం నడిబొడ్డున ఉన్న సిగాచిలో కూడానా?అంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. 

Related Post