ప్రైవేట్ సెక్టర్‌లో రిజర్వేషన్స్ అమలు చేయాలి: వీహెచ్

April 13, 2025
img

సీనియర్ కాంగ్రెస్‌ నాయకుడు వి. హనుమంత రావు ఈరోజు గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వ శాఖలలో, ప్రభుత్వ సంస్థలలో రిజర్వేషన్స్ అమలుచేస్తే సరిపోదు. వాటి వలన బడుగు బలహీనవర్గాలకు పూర్తి న్యాయం జరుగట్లేదు. ప్రైవేట్ సెక్టర్లో కూడా రిజర్వేషన్స్ అమలుచేస్తేనే వారికి ఉద్యోగావకాశాలు పెరిగి సమాజంలో ఇతర వర్గాలతో సమానంగా ఎదగగలుతారనే జీవన్ రెడ్డి వాదనలను నేను సమర్ధిస్తున్నాను,” అని అన్నారు. 

కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇటువంటి ఆలోచన చేయగానే పలు ఐటి కంపెనీలు అక్కడి నుంచి వేరే రాష్ట్రాలకు తరలిపోక తప్పదని హెచ్చరించాయి. కనుక తెలంగాణలో కూడా అదే జరుగుతుంది. కనుక రాజకీయాల నుంచి రిటైర్ కావలసిన వయసులో ఉన్న వి. హనుమంత రావు వంటి సీనియర్లు ఇటువంటి ప్రమాదకరమైన ప్రతిపాదనలు చేసే ముందు కాస్త ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. 

Related Post