ఆదాయపన్ను శాఖ అధికారులు బుధవారం రెండో రోజు కూడా దిల్‌రాజు ఇల్లు, కార్యాలయంలో సోదాలు జరుపుతూ రికార్డులు పరిశీలిస్తున్నారు. వారు లోపల సోదాలు చేస్తూ రికార్డులు పరిశీలిస్తుంటే, దిల్‌రాజు మాత్రం నిశ్చింతగా బాల్కనీలో కూర్చొని చిర్నవ్వులు చిందిస్తూ బయట గేటు వద్ద కెమెరాలు పట్టుకొని నిలుచున్న మీడియా ప్రతినిధులతో కులాసాగా కబుర్లు చెపుతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఐటి దాడులు గురించి వారు ప్రశ్నించగా దిల్‌రాజు నవ్వుతూ నా ఒక్కడి ఇంట్లోనే జరగడం లేదు కదా? సినీ పరిశ్రమలో చాలా మందిపై దాడులు జరుగుతున్నాయి కదా?అని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం రెండు సినిమాల నిర్మాణంలో దిల్‌రాజు కూడా భాగస్వామిగా ఉన్నారు. వాటిలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. వాటి గురించి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం వల్లనే ఆదాయపన్ను శాఖ అధికారుల దృష్టి దిల్‌రాజుపై పడిందా లేదా సినీ పరిశ్రమలో ఎవరైనా ఆయన ఆదాయం గురించి వారికి రహస్యంగా సమాచారం అందించడం వల్లనే రెండో రోజు కూడా రికార్డులు పరిశీలిస్తున్నారా?అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఆదాయపన్ను శాఖ అధికారులు ఈరోజు పుష్ప-2 దర్శకుడు సుకుమార్ ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయనని, కుటుంబ సభ్యులను బ్యాంకుకి తీసుకువెళ్ళి లాకర్స్ తెరిపించి వాటిలో ఉన్న డబ్బు, బంగారం, స్థిరాస్తి పత్రాలు వగైరాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.