మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం: మార్గదర్శకాలు జారీ

December 08, 2023
img

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులోకి రాబోతోంది. మహాలక్ష్మి పధకం కింద టిఎస్‌ఆర్టీసీ బస్సులలో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. దీనికి సంబందించి మార్గదర్శకాలను టిఎస్‌ఆర్టీసీ విడుదల చేసింది. 

• టిఎస్‌ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్‌, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, ఆర్డినరీ, సిటీ బసులలో ప్రయాణించవచ్చు. 

• తెలంగాణ స్థానికత కలిగిన మహిళలు, బాలికలు, విద్యార్ధినులు, ట్రాన్స్ జెండర్స్ గుర్తింపు కార్డు చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చు. 

• కిలోమీటర్ల ప్రయాణ పరిమితి లేదు. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. 

• తెలంగాణ రాష్ట్రం పరిధిలో తిరిగే టిఎస్‌ఆర్టీసీ బస్సులలో మాత్రమే ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంటుంది. కనుక పొరుగు రాష్ట్రాలకు వెళ్ళేవారికి రాష్ట్ర సరిహద్దు వరకు ఉచిత ప్రయాణం, ఆ పైన యధాప్రకారం ఛార్జీలు చెల్లించవలసి ఉంటుంది. 

• ఉచిత ప్రయాణం వెసులు బాటు పొందే మహిళలకు ‘జీరో ఛార్జీ టికెట్‌ ఇవ్వబడుతుంది.

• శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు సిఎం రేవంత్‌ రెడ్డి ఈ మహాలక్ష్మి ఉచిత బస్సు పధకాన్ని ప్రారంభిస్తారు. 

• ఈ పధకం ప్రారంభించగానే మధ్యాహ్నం 2 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగే 7,200 బస్సులలో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు.   


Related Post