తెలంగాణలో అడ్వెంట్ ఇంటర్నేషనల్ భారీ పెట్టుబడి

September 30, 2023
img

దేశంలో పెట్టుబడులు పెట్టాలనుకొనేవారు ఇదివరకు గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు ఎక్కువ మొగ్గుచూపేవారు. కానీ తెలంగాణ ప్రభుత్వ విధానాలు, ప్రోత్సాహకాలు, తోడ్పాటు కారణంగా ఇప్పుడు ముందుగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గుచూపుతున్నారు. కనుక ఇప్పుడు తెలంగాణకు పెట్టుబడులు వస్తే ఎవరూ ఆశ్చర్యపడటం లేదు.  

తాజాగా గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్ సంస్థ తెలంగాణలో రూ.16,650 కోట్ల అతిభారీ పెట్టుబడితో తన వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించబోతోంది. దీని కోసం ఆ సంస్థ ఎండీ పంకజ్ పట్వారి, వైదీష్ అన్నస్వామి తదితరులు హైదరాబాద్‌కు వచ్చి రాష్ట్ర ఐ‌టి, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. 

ఈ సంస్థ హైదరాబాద్‌లో ఫార్మా కంపెనీలకు ఎంతో ఉపయుక్తంగా ఉండే గ్రీన్ ఫీల్డ్ రీసర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌ ల్యాబ్ ఏర్పాటు చేయబోతోంది. 

 

Related Post