హైదరాబాద్‌లో మొట్ట మొదటిసారిగా హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ నేడు జరుగుతోంది. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం ఉదయం గోల్కొండ కోట సమీపంలో గోల్ఫ్ క్లబ్ వద్ద హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ ప్రారంభించారు. తర్వాత ఆయన స్వయంగా హాట్ ఎయిర్ బెలూన్‌లో సుమారు అర్ధగంటసేపు విహరించారు. గోల్కొండ కోట వద్ద నుంచి 13 కిమీ దూరంలో ఉన్న అప్పాజీగూడ శివారులో దిగారు.
ఈ కార్యక్రమంలో దేశ విదేశాలకు చెందిన హాట్ ఎయిర్ బెలూన్ నిర్వాహకులు రంగురంగుల బెలూన్లతో సందడి చేశారు. పర్యాటక శాఖ ఈ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ గురించి ముందే పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో హైదరాబాద్‌తో సహా చుట్టుపక్కల జిల్లాల నుంచి వేలాదిమంది ప్రజలు తరలివచ్చారు. పలువురు టికెట్ ఛార్జీ చెల్లించి హాట్ ఎయిర్ బెలూన్‌లో ఆకాశంలో విహరించారు. తమ జీవితంలో ఇదో మరిచిపోలేని అద్భుతమైన అనుభూతి అని చెప్తున్నారు.
ఈ కార్యక్రమంలో పర్యాటకశాఖ ఎండీ క్రాంతి వల్లూరితో సహా పలువురు అధికారులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ నెల 18వరకు గోల్కొండ వద్ద ఈ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ జరుగుతుంది. కనుక ప్రజలు ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోవాలని మంత్రి జూపల్లి విజ్ఞప్తి చేశారు.
TG: హైదరాబాద్‌లోని చారిత్రక గోల్కొండ కోట సమీపంలో 'హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్' అట్టహాసంగా ప్రారంభమైంది. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా బెలూన్‌లో విహరించి ఈ సాహస యాత్రను ప్రారంభించారు. గగనతలంలో సుమారు 13 కిలోమీటర్ల మేర గంటన్నర పాటు ఆయన ప్రయాణించారు. ఈ అనుభూతి… pic.twitter.com/5I1WDmZMmg