దర్శకుడు తేజ కుమారుడికి కుచ్చు టోపీ

January 14, 2026
img

స్టాక్ మార్కెట్లో పెట్టుబడితే చాలా తక్కువ సమయంలో భారీగా లాభాలు వస్తాయంటూ సైబర్ నేరగాళ్ళు అమాయక ప్రజలను మోసాలు చేస్తూనే ఉన్నారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ భార్య ఊర్మిళ వంటివారు కూడా సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో చిక్కుకొని భారీగా సొమ్ము  పోగొట్టుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్‌ దర్శకుడు తేజ కుమారుడు వారి ఉచ్చులో చిక్కుకొని రూ.72 లక్షలు పోగొట్టుకున్నారు. 

సైబర్ క్రైమ్‌ పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం భార్యాభర్తలుగా చెప్పుకున్న ఓ జంట ఆన్‌లైన్‌లో అమితవ్ తేజతో పరిచయం పెంచుకొని స్టాక్ మార్కెట్లో పెట్టుబడితే చాలా తక్కువ సమయంలో భారీగా లాభాలు వస్తాయంటూ నమ్మించారు. తాము ఇలాగే లాభాలు ఆర్జించామని నమ్మించారు.

వారి మాయమాటలు నమ్మిన అమితవ్ తేజ పలు దఫాలలో మొత్తం రూ.72 లక్షలు వారు సూచించిన పోర్టల్ ద్వారా షేర్లు కొనుగోలు చేశారు. కానీ ఆ తర్వాత డబ్బు వాపసు తీసుకుందామని ఎంత ప్రయత్నించినా సొమ్ము వాపసు రాలేదు. దానిలో తనతో పెట్టుబడులు పెట్టించిన దంపతులకు ఫోన్ చేయబోతే సిచ్చాఫ్ వచ్చింది.

తాను మోసపోయానని గ్రహించిన తర్వాత అమితవ్ తేజ సైబర్ క్రైమ్‌ పోలీసులకు పిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.   


Related Post