మహేష్ బాబుకి ఈడీ నోటీసులు.. విచారణ!

April 22, 2025
img

ప్రముఖ సినీ నటుడు మహేష్ బాబుకి ఈడీ నోటీస్ ఇచ్చింది. ఆయన సాయిసూర్య దేవలపర్స్, సురానా ప్రాజెక్టులకు ప్రచారకర్తగా వాణిజ్య ప్రకటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందుకుగాను ఆ రెండు సంస్థల నుంచి భారీగా పారితోషికం తీసుకున్నారు.

కనుక ఆ రెండు వెంచర్స్‌లో సామాన్య ప్రజలని పెట్టుబడులు పెట్టాలని ప్రభావితం చేస్తున్నందుకుగాను వివరణ ఇచ్చేందుకు ఈ నెల 27న హైదరాబాద్‌లోని తమ కార్యాలయంలో హాజరు కావలసిందిగా మహేష్ బాబుని కోరింది. అలాగే ఆ సంస్థల తరపున ప్రచారం చేసినందుకు ఆయన తీసుకున్న పారితోషికం గురించి ఆరా తీయబోతున్నారు. 

మహేష్ బాబు-రాజమౌళితో వెయ్యి కోట్ల భారీ బడ్జెట్‌తో ఎస్ఎస్ఎంబీ29 షూటింగ్ మొదలుపెట్టిన తర్వాత హటాత్తుగా ఈడీ నోటీస్ ఇవ్వడంతో సినీ పరిశ్రమతో బాటు అభిమానులు ఉలిక్కిపడుతున్నారు.

కానీ సినీ పరిశ్రమలో చాలా నిజాయితీగా ఆదాయపన్ను లెక్కలు సమర్పించి, ఎప్పటికప్పుడు ఆదాయపన్ను చెల్లించే ప్రముఖులలో మహేష్ బాబు కూడా ఒకరు. కనుక ఇది ఆయనకు సమస్య కాకపోవచ్చు. 

Related Post