ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు, నిర్మాత అమీర్ ఖాన్ గత నెలలో 60వ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తన కొత్త జీవిత భాగస్వామి గౌరీ స్ప్రాట్‌ని మీడియాకు పరిచయం చేశారు.
తమకు గత 25 ఏళ్ళుగా పరిచయం ఉందని కానీ ఏడాదిన్నర క్రితం ఆమె ముంబయి వచ్చినప్పుడు కొన్ని కార్యక్రమాలలో కలిసామని, అప్పటి నుంచే తామిద్దరం కలిసి జీవిస్తున్నామని అమీర్ ఖాన్ చెప్పారు.
వారిద్దరూ కలిసి చైనాలో జరిగిన మకావు ఇంటర్నేషనల్ కామెడీ ఫిలిమ్ ఫెస్టివల్‌కు శనివారం హాజరయ్యారు. అక్కడ కూడా ఆమెను చైనా మీడియాకు తన జీవిత భాగస్వామిగా పరిచయం చేసి ఇద్దరూ చేతిలో చేయి వేసుకొని ఫోటోలు దిగారు.
అమీర్ ఖాన్ 1986లో రీనాదత్తని వివాహం చేసుకున్నారు. వారికి జునైద్ అనే ఓ కుమారుడు, ఈరా అనే ఓ కుమార్తె కలిగారు. కానీ మనస్పర్ధల కారణంగా 2002, డిసెంబర్‌లో విడాకులు తీసుకున్నారు.
అమీర్ ఖాన్ 2005, డిసెంబర్‌లో అసిస్టెంట్ డైరెక్టర్ కిరణ్ రావుని వివాహం చేసుకున్నారు. సరోగసీ (అద్దె గర్భం) ద్వారా ఆజాద్ రావు ఖాన్ అనే కుమారుడు జన్మించాడు. కానీ సుమారు 22 ఏళ్ళు కాపురం చేసిన తర్వాత ఆమెకు కూడా అమీర్ ఖాన్ విడాకులు ఇచ్చారు.
ఇప్పుడు గౌరీ స్ప్రాట్‌తో సహజీవనం చేస్తున్నారు. అమీర్ ఖాన్ వయసు ఇప్పుడు 60 ఏళ్ళు. కనుక ఆమెతో శేష జీవితం పూర్తి చేస్తారా లేక ఆమెని కూడా విడిచిపెడతారా? అనేది కొన్నేళ్ళ తర్వాత తెలుస్తుంది.