ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొడుకు అకిర నందన్‌తో కలిసి కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో తీర్ధయాత్రలు చేస్తున్నారు. బుధవారం ఉదయం ఇద్దరూ కలిసి కేరళలోని కొచ్చి సమీపంలో గల అగస్త్య మహర్షి ఆలయానికి వెళ్ళి దర్శించుకుని పూజలలో పాల్గొన్నారు.
వారికి కేరళ ప్రభుత్వం తరపున జిల్లా మంత్రి, ఉన్నతాధికారులు, ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. వారి వెంట టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి ఉన్నారు.
భోజన విరామం తర్వాత అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం తిరువంతపురం చేరుకుంటారు. అక్కడ పరశురామ ఆలయం దర్శించుకుంటారు. రేపు ఉదయం పవన్ కళ్యాణ్, అకిరా నందన్ ఇద్దరూ కలిసి అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని దర్శించుకుంటారు.
ఆ తర్వాత అక్కడి నుంచి తమిళనాడులో మధుర మీనాక్షి అమ్మవారి ఆలయాన్ని, కుంభేశ్వర, తిరుత్తణిలో శ్సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాన్ని దర్శించుకుంటారు. తర్వాత అగస్త్య మహర్షి జీవసమాధి, స్వామి మలై, కుంభేశ్వర స్వామివారి ఆలయాలను దర్శించుకున్న తర్వాత హైదరాబాద్ చేరుకుంటారు.
అకిరా నందన్ తండ్రి కంటే చాలా పొడువుగా ఉన్నాడు. భవిష్యత్‌లో అతను కూడా సినీ పరిశ్రమలోకి వచ్చే అవకాశం ఉంది.