హైదరాబాద్, అబిడ్స్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కుంభం నరసింహపై ఆయన భార్య కుంభం సంధ్య హైదరాబాద్ పోలీస్ కమీషనర్‌కి లిఖితపూర్వకంగా పిర్యాదు చేశారు. తమ పెళ్ళయి 12 ఏళ్ళు అయ్యిందని ఇంకా పుట్టింటి నుంచి కట్నం, బంగారం తీసుకురావాలంటూ రోజూ వేధిస్తున్నాడని ఆమె పిర్యాదు చేశారు.
ఆయన వేధింపులు భరించలేక పలుమార్లు తన పుట్టింటివాళ్ళు కొంత కొంత సొమ్ము, బంగారం తెచ్చి ఇస్తూనే ఉన్నారని ఆమె లేఖలో పేర్కొన్నారు. కానీ ఇంకా డబ్బు, బంగారం తీసుకు రావాలని ఒత్తిడి చేస్తూ రోజూ ఏదో వంకతో తనని మానసికంగా, శారీరికంగా హింసిస్తూనే ఉన్నాడని కుంభం సంధ్య థియేటర్ పేర్కొన్నారు.
తన భర్త వేధింపులు రోజురోజుకీ పెరిగిపోతుండటంతో ఇక భరించలేక వచ్చి పిర్యాదు చేస్తున్నానని, కనుక వరకట్న వేధింపులు, గృహ హింస కింద తన భర్త కుంభం నరసింహంపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కమీషనర్‌కి విజ్ఞప్తి చేశారు. తమకి 10 ఏళ్ళ కుమార్తె ఉందని కుంభం సంధ్య లేఖలో తెలియజేశారు.
హైదరాబాద్: అబిడ్స్ పోలీస్ స్టేషన్ DI నరసింహ పై హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన DI భార్య సంధ్య.
— ChotaNews App (@ChotaNewsApp) February 8, 2025
అదనపు కట్నం కోసం మానసికంగా, శారీరకంగా చిత్రహింసిస్తున్నాడని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లిన బాధిత మహిళ.
పెళ్లై 12 ఏళ్ళు అవుతుందని అదనపు కట్నం తీసుకురావాలి లేదంటే రెండో పెళ్లి… pic.twitter.com/UvmSOZeYHk