లంచగొండి అధికారిణిని భర్తే పట్టించాడు

October 09, 2024
img

హైదరాబాద్‌లో ఓ అరుదైన ఘటన జరిగింది మానికొండ మునిసిపల్ కార్యాలయంలో డీఈఈగా పనిచేస్తున్న దివ్య జ్యోతి అవినీతి భాగోతాన్ని స్వయంగా ఆమె భర్తే సోషల్ మీడియా సాక్షిగా బయటపెట్టాడు.

తన భార్య లంచాలకు అలవాటు పడి కాంట్రాక్టర్ల వద్ద నుంచి ప్రతీరోజూ లక్షల రూపాయలు ఇంటికి తెస్తోందని, తాను ఆమెను ఎంతగా వారించినా వినకపోవడంతో ఆమె ఈ లంచాల భాగోతం బయటపెట్టానని చెప్పారు.

ఆమె తమ ఇంట్లో దాచిపెట్టిన డబ్బు కట్టలను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఇంట్లో ఎక్కడ చూసినా రూ.500 నోట్ల డబ్బు కట్టలే కనిపించాయి. ఇంట్లోనే సుమారు రూ.15 లక్షల వరకు నగదు ఉందని చెపుతూ నోట్ల కట్టలను చూపాడు. 

తన భార్య దివ్యజ్యోతి ఆమె తమ్ముడికి సుమారు రూ.1.15 కోట్ల రూపాయలు ఇచ్చిందని, అతని బ్యాంక్ ఖాతాలో రూ.70 లక్షలు వేసి మిగిలినది నగదు రూపంలో చేతికి ఇచ్చిందని చెప్పారు. సోషల్ మీడియాలో ఈ డబ్బు కట్టాల వీడియోలను పోస్ట్ చేసి, అవినీతి నిరోదక శాఖ, పోలీసులకు దానిని పంపాడు. 

ఓ భర్త ఆవినేతిపరురాలైన తన భార్యను సాక్ష్యాధారాలతో సహా పోలీసులకు పట్టించడం, ఆ డబ్బు కట్టల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Post