ఈరోజు ఉదయం కరీంనగర్‌లో ఆర్టీసీ బస్సు ప్రమాదం జరిగింది. మెట్‌పల్లి డిపోకు చెందిన బస్సు ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళుతుండగా జిల్లాలో తిమ్మాపూర్ మండలం రేణికుంట బ్రిడ్జి వద్ద వడ్లు తీసుకువెళుతున్న ట్రాక్టర్‌ని ఢీ కొట్టింది. కానీ అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణాపాయం కలుగలేదు. బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకొని గాయపడినవారిని కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
సోమవారం తెల్లవారుజామున వికారాబాద్ నుంచి హైదరాబాద్ వెళుతున్న ఆర్టీసీ బస్సు, కంకర లోడ్ తీసుకువెళుతున్న టిప్పర్ వాహనం ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 19 మంది చనిపోగా మరో 24 మంది గాయపడ్డారు.
24 గంటల వ్యవధిలోనే రెండు ఆర్టీసీ బస్సు ప్రమాదాలు జరుగడం చాలా బాధాకరమని, బాధితులకు అవసరమైతే హైదరాబాద్‌కు తరలించి మెరుగైన చికిత్స అందించాలని ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ జిల్లా కలెక్టర్ ప్రమీల సత్పతిని కోరారు.