మార్క్ శంకర్ హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్: చిరంజీవి

October 11, 2024
img

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ కుమారుడు మార్క్ శంకర్ హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్నాడని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులు, ప్రజలకు తెలియజేశారు.

సింగపూర్ స్కూల్లో చదువుకుంటున్న మార్క్ శంకర్ తరగతి గదిలో జరిగిన అగ్ని ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డాడు. ఊపిరి తిత్తులలోకి పొగ వెళ్ళడం వలన ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. స్కూలు సిబ్బంది సకాలంలో హాస్పిటల్‌కు తరలించడంతో వైద్యులు అత్యవసర చికిత్స చేయడంతో మార్క్ శంకర్ మూడు రోజులలోనే కోలుకున్నాడు.

చిరంజీవి దంపతులు, పవన్ కళ్యాణ్‌ హుటాహుటిన సింగపూర్ వెళ్ళి మార్క్ శంకర్‌కు ధైర్యం చెప్పారు. అతను కోలుకోగానే ఇంటికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా అతని కోసం భగవంతుని ప్రార్థించిన వారందరికీ చిరంజీవి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ట్వీట్ చేశారు. ఆయనేమన్నారో ఆయన మాటల్లోనే..          

Related Post