ఉత్తరప్రదేశ్ రాజధాని ప్రయాగరాజ్‌లో త్రివేణీ సంగమం వద్ద జరుగుతున్న కుంభమేళాలో ఎన్నో వింతలు, విశేషాలు, జోకులు, విషాదాలు.. వింటూనే ఉన్నాము. అచ్చం పుష్పరాజ్ రూపురేఖలతో ఉన్న ఓ యువకుడు అదే గెటప్‌లో కుంభమేళకి రావడంతో ప్రత్యేక ఆకర్షణగా మారాడు. అతను, అతని గెటప్, పుష్ప-2లో అతను చెపుతున్న పుష్పరాజ్ డైలాగ్స్ చూసి సామాన్య భక్తులే కాదు.. పోలీస్ అధికారులు కూడా చాలా ముచ్చటపడుతున్నారు. వారు మళ్ళీ మళ్ళీ అతనిచేత ఆ డైలాగ్స్ చెప్పించుకుంటున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మీరూ చూసి ఆనందించండి..
పుష్ప గెటప్‌లో మహాకుంభమేళాలో సందడి చేసిన అల్లు అర్జున్ అభిమాని | 10TV#MahaKumbh2025 #AlluArjun #AlluArjunFans #Pushpa2 #KumbhMela2025 #Reels #ViralVideos #10TV pic.twitter.com/2Eae4MSmPH
— 10Tv News (@10TvTeluguNews) February 6, 2025