తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న రేవంత్‌ రెడ్డి

May 21, 2024
img

రేవంత్‌ రెడ్డి సకుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఆయన తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా తిరుమలకు వస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో వస్తున్న ఆయనకు ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. 

మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో పరిశ్రమల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన తర్వాత సాయంత్రం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి రేణిగుంట చేరుకుంటారు.

ఈరోజు రాత్రి కొండపైనే అతిధి భవనంలో బస చేసి రేపు తెల్లవారుజామున స్వామివారిని దర్శించుకుంటారు. తర్వాత మళ్ళీ హైదరాబాద్‌ తిరుగు ప్రయాణం అవుతారు. మనుమడికి పుట్టు జుట్టు మొక్కు చెల్లించుకునేందుకు సిఎం రేవంత్‌ రెడ్డి సకుటుంబ సమేతంగా తిరుమలకు వస్తున్నారు. 

గతం కేసీఆర్‌ లేదా బిఆర్ఎస్ మంత్రులు ఎవరైనా తిరుమలకు వస్తే మంత్రులు లేదా స్థానిక వైసీపి నేతలు వచ్చి సాదరంగా ఆహ్వానించేవారు. కానీ రేవంత్‌ రెడ్డికి ఆహ్వానం పలకడానికి ఏపీ మంత్రులు ఎవరైనా వస్తారో రారో చూడాలి. 

Related Post