విజయ్‌ ఆంటోని కుమార్తె ఆత్మహత్య

September 19, 2023
img

ప్రముఖ కోలీవుడ్ నటుడు, బిచ్చగాడు సినిమా హీరో విజయ్‌ ఆంటోని ఇంట్లో తీవ్ర విషాదం సంభవించింది. ఆయన కుమార్తె మీరా ఆంటోని (16) ఈరోజు తెల్లవారుజామున తమ ఇంట్లోనే ఫ్యానుకి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. చెన్నైలోని ఆళ్వార్ పేటలోని డీడీకె రోడ్డులో ఆంటోని కుటుంబం నివాసం ఉంటోంది. ఆయన కూతురు మీరా ఆంటోని చర్చ్ పార్క్ స్కూల్లో 12వ తరగతి చదువుతోంది.

ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు తన గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొంది. కుటుంబ సభ్యులు గమనించి ఆమెను వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్ళారు కానీ అప్పటికే ఆమె మృతి చెందిన్నట్లు వైద్యులు తెలిపారు.

చదువుల ఒత్తిడి కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకొన్నట్లు తెలుస్తోంది. కానీ పోలీసుల దర్యాప్తులో అసలు విషయం తెలియవచ్చు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. విజయ్‌ ఆంటోని సినిమా షూటింగ్‌ కోసం బయటకు వెళ్ళిన్నట్లు సమాచారం.

Related Post