ధోనీ మోకాలి చికిత్స విజయవంతం

June 01, 2023
img

ఐపిఎల్ సీజన్‌-16లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి సారధ్యం వహించి కప్పు గెలిపించిన మహేంద్ర సింగ్‌ ధోనీకి ఆ చివరి మ్యాచ్ జరుగుతుండగానే మోకాలి నొప్పి తీవ్రమైంది. ఆట ముగిసిన వెంటనే ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రిలో చేరగా వైద్యులు గురువారం మోకాలికి కీ హోల్ సర్జరీ చేశారు. ఆపరేషన్ విజయవంతం అయ్యిందని, రెండు మూడు రోజులలో ధోనీని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు. చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథ్ హాస్పిటల్‌కు వెళ్ళి ధోనీని పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ, “ధోనీ మోకాలికి శస్త్రచికిత్స చేసినప్పటికీ ఆయన పూర్తి ఫిట్‌గానే ఉన్నారు. ఇంతకు ముందు వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు శస్త్రచికిత్స చేసిన డాక్టర్ దిన్షా పార్ధీవాలా నేడు ధోనీకి ఈ శాస్త్ర చికిత్స చేశారని కాశీ విశ్వనాధ్ తెలిపారు. కీ హోల్ సర్జరీ కావడంతో త్వరగానే కోలుకొని హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్ అవుతారని చెప్పారు.     


Related Post