అచ్చంపేట హెల్త్ సెంటర్ ఇప్పుడు వందపడకల ఆసుపత్రి!

May 30, 2023
img

తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు అత్యవసరంగా వైద్య సేవలు పొందాలంటే   జిల్లా కేంద్రాలకు, ఇంకా సీరియస్ కేసులైతే హైదరాబాద్‌కు వెళ్ళవలసి వచ్చేది. కానీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో మారుమూల గ్రామాలకు కూడా వైద్య సౌకర్యాలు కల్పించేందుకు ఎక్కడికక్కడ ఆసుపత్రులను నియమిస్తోంది. ప్రతీ జిల్లా కేంద్రంలో ఉండే ప్రభుత్వాసుపత్రులకు అనుబందంగా వైద్యకళాశాలలు, నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేస్తోంది. తద్వారా రాష్ట్రంలో వైద్యుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటమే కాక, జిల్లా ప్రజలకు జిల్లాలోనే వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి.    

తాజాగా నాగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలో 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసిన్నట్లు రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు ట్వీట్‌ చేశారు. దీనిలో ఎమర్జన్సీ వార్డు, ఐసీయూ, చిన్న పిల్లల వార్డు, డయాలసిస్ విభాగం, బ్లడ్ బ్యాంక్ ఇంకా పెద్ద ఆసుపత్రులలో ఉండే సకల వైద్య సేవలు లభిస్తాయి. తాను ఈరోజు ఈ ఆసుపత్రిని ప్రారంభించబోతున్నట్లు మంత్రి హరీష్‌ రావు తెలిపారు.


Related Post