మాతో ఉంటూ ప్రత్యర్ధులకు పనిచేసేవాడు పరాయివాడే

May 14, 2024
img

అల్లు అర్జున్‌కి మెగా ఫ్యామిలీ నుంచి తొలిసారిగా షాక్ తగిలింది. నిజానికి ఆయన కూడా మెగా ఫ్యామిలీకి షాక్ ఇచ్చారు. ఓ పక్క జనసేన దాని అధినేత పవన్‌ కళ్యాణ్‌ టిడిపితో కలిసి ఎన్నికలలో పోటీ చేస్తుండగా, అల్లు అర్జున్‌ పోలింగ్‌కు రెండు రోజుల ముందు కర్నూలు జిల్లా నంద్యాలలోని తన స్నేహితుడు, వైసీపి ఎమ్మెల్యే అభ్యర్ధి శిల్పా రవీంద్ర రెడ్డి ఇంటికి వెళ్ళారు. అల్లు అర్జున్‌ ఆయనతో కలిసి తన అభిమానులకు అభివాదం చేశారు. అంటే తన అభిమానులను ఆయనకు ఓట్లు వేయమని సూచించిన్నట్లే భావించవచ్చు. 

దీనిపై చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేయగా నాగబాబు, “మాతో ఉంటూ ప్రత్యర్ధులకి పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే...”అని ట్వీట్‌ చేశారు. అది అల్లు అర్జున్‌ని ఉద్దేశ్యించి చేసినదే అని వేరే చెప్పక్కరలేదు. 

అల్లు అర్జున్‌ రాజకీయాలు తెలియకనే నంద్యాల వెళ్ళి వైసీపి అభ్యర్ధికి సంఘీభావం ప్రకటించారని అనుకోవడానికి లేదు. కనుక తెలిసే వైసీపి అభ్యర్ధికి మద్దతు ప్రకటించారని భావించాల్సి ఉంటుంది.

అల్లు అరవింద్, కొణిదెల కుటుంబాల మద్య గత కొన్నేళ్ళుగా అంతర్గతంగా కోల్డ్ వార్ నడుస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈవిదంగా బహిర్గతం అయ్యాయని అనుకోవచ్చు.

అల్లు అర్జున్‌ నంద్యాల వెళ్ళి వైసీపి అభ్యర్ధికి మద్దతు ఇవ్వడంపై పవన్‌ కళ్యాణ్‌ ఇంతవరకు స్పందించలేదు. కానీ ఆయన తరపున నాగబాబు స్పందించి ఉండవచ్చు. 

Related Post