మళ్ళీ కళకళలాడుతున్న హైదరాబాద్‌

May 14, 2024
img

హైదరాబాలో స్థిరపడిన ఆంధ్రా ప్రజలు తమ రాష్ట్రంలో శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకున్నాక మళ్ళీ నగరానికి చేరుకుంటున్నారు. నేటి నుంచి మళ్ళీ డ్యూటీలో చేరవలసి ఉంటుంది కనుక చాలా మంది మంగళవారం తెల్లవారుజాముకే బస్సులు, రైళ్ళు, కార్లలో హైదరాబాద్‌ చేరుకున్నారు. 

కనుక మూడు రోజులు కళ తప్పిన హైదరాబాద్‌ నగరం మళ్ళీ నిండుగా కళకళలాడుతోంది. తెల్లవారుజాము నుంచి సిటీ బస్సులు, మెట్రో, ఎంఎంటిఎస్ రైళ్ళు కిటకిటలాడుతున్నాయి. ఎల్బీ నగర్‌, ఆమీర్ పేట, మియాపూర్ మెట్రో స్టేషన్లలో రద్దీ విపరీతంగా ఉంటుందని మెట్రో అధికారులు ముందే ఊచించడంతో అరగంట ముందు నుంచే అదనపు సర్వీసులు కూడా ప్రారంభించి నడిపిస్తున్నారు. 

లోక్‌సభ ఎన్నికలలో ఓట్లు వేసేందుకు వివిద జిల్లాలకు వెళ్ళిన తెలంగాణవాసులు కూడా తిరిగి వస్తున్నారు. దీంతో అంతర్ రాష్ట్ర బస్ సర్వీసులన్నీ కిటకిటలాడుతున్నాయి. మళ్ళీ నగరంలో మార్కెట్లు, టిఫిన్ సెంటర్స్ అన్నీ  తెరుచుకోవడంతో జనాలతో కళకళలాడుతున్నాయి.   


Related Post