గత కొన్నేళ్ళుగా మంచు కుటుంబానికి అటు సినీ రంగంలో, ఇటు కుటుంబంలో కూడా చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. చాలా కాలం తర్వాత మంచు కుటుంబంలో సంతోషం కనిపించింది. మంచు మనోజ్, మౌనిక దంపతులకు పండంటి ఆడబిడ్డ పుట్టిందని మంచు లక్ష్మి తెలియజేశారు.
తల్లీ బిడ్డా ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని ఆమె తెలిపారు. భగవంతుడి ఆశీస్సులతో మంచు కుటుంబంలో ఓ చిన్నారి దేవత అడుగుపెట్టింది. మేము ఆ పాపను ప్రేమగా ఎంఎం (మనోజ్, మౌనిక) పులి అని పిలిచుకుంటున్నాము.
ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు వారి కుటుంబంపై ఉండాలని, అందరూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకొంటున్నాను,” అని మంచు లక్ష్మి ట్విట్టర్ ద్వారా ఈ శుభవార్తని అభిమానులతో పంచుకున్నారు. మంచు మనోజ్ దంపతులకు బంధు మిత్రులు, అభిమానులు అభినందనలు తెలియజేస్తున్నారు.
మంచు మనోజ్ మళ్ళీ చాలా ఏళ్ళ గ్యాప్ తర్వాత వరుణ్ కోరుకొండ దర్శకత్వంలో వాట్ ది ఫిష్’ అనే యాక్షన్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలో కొణిదెల నీహారిక ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు.