అయోధ్య రాముడి ప్రసాదం... స్పీడు పోస్టులో

February 29, 2024
img

అయోధ్యలో బాల రాముడి దివ్యమంగల విగ్రహాన్ని ప్రతిష్టించినప్పటి నుంచి దేశంలో హిందువులు ఒక్కసారి అయోధ్య వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలని తహతహలాడుతున్నారు. కానీ అనేక సమస్యలు, కారణాల వలన చాలామంది అయోధ్య వెళ్ళలేకపోతున్నారు.

వారి కోసమే పోస్టల్ డిపార్ట్‌మెంట్ స్పీడ్ పోస్టులో అయోధ్య రాముడి ప్రసాదం (లడ్డూలు), మహావీర్ గంధం, అక్షితలు, హనుమంతులవారి ఫోటో, అయోధ్య దర్శనం పేరుతో అయోధ్య, రామాలయం విశేషాలను తెలియజేసే ఓ పుస్తకాన్ని పంపించేందుకు ఏర్పాట్లు చేసింది.

దీని కోసం భక్తులు తమ సమీపంలోని పోస్టాఫీసుకు వెళ్ళి ‘డెప్యూటీ పోస్ట్ మాస్టర్, అయోధ్య ధామ్, పిన్ కోడ్: 224123 పేరిట రూ.251 మానియార్డర్ చేసిన్నట్లయితే, అయోధ్య రాముడి ప్రసాదం వగైరా స్పీడు పోస్టులో పంపిస్తామని ప్రయాగ్‌రాజ్‌, వారణాసి జోన్ పోస్ట్ మాస్టర్ కృష్ణ కుమార్‌ తెలియజేశారు. 

అయోధ్య రామమందిరంలో జరుగుతున్న నిత్య పూజలు ఆన్‌లైన్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. అయోధ్య రామ మందిరం దర్శనం కోసం వెళ్ళేవారి కోసం దర్శనం, పూజలు, వసతి, తదితర పూర్తి వివరాల కోసం  శ్రీరామ్ జన్మభూమి తీర్ధ్ క్షేత్ర వారి అధికారిక వెబ్‌సైట్‌: https://online.srbjtshetra.orgని సందర్శించవచ్చు.

Related Post