నిర్మల్ జిల్లాలో ఇంజనీరింగ్ విద్యార్ధిని గుండెపోటుతో మృతి

February 25, 2024
img

నిర్మల్ జిల్లా నర్సాపూర్ (బి)మండలంలోని బామిని (బి) గ్రామానికి చెందిన నార్వాడే హాసిని (18) గురువారం రాత్రి గుండెపోటు మరణించింది. ఆమె హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ (మొదటి సంవత్సరం) చేస్తోంది.

రెండుమూడు రోజులుగా అస్వస్థతగా ఉండటంతో ఆమె గురువారం గ్రామంలో ఉంటున్న తల్లితండ్రుల వద్దకు వచ్చింది. అదే రోజు రాత్రి గుండె నొప్పిగా ఉందని చెప్పడటంతో తల్లితండ్రులు ఆమెను వెంటనే నిర్మల్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. కానీ కొద్ది సేపటికే ఆమెకు గుండెపోటు వచ్చి మరణించింది.

ఇంత చిన్న వయసులో కుమార్తె గుండెపోటుతో చనిపోవడం చూసి తల్లితండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆమె తండ్రి నార్వాడే వెంకట్ రావు నిర్మల్ పట్టణంలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. 

ఇటీవలే ఇద్దరు ఆర్టీసీ డ్రైవర్లు ప్రయాణికులతో బస్సు నడుపుతుండగా గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. వారిరువురూ 50 ఏళ్ళకు పైబడినవారే కనుక ఆ వయసులో ఇటువంటి ఆరోగ్య సమస్యలు రావడం సహజమని సరిపెట్టుకోవచ్చు. కానీ 18 ఏళ్ళ వయసులోనే గుండెపోటుతో నార్వాడే హాసిని మృతి చెందడం చాలా బాధాకరమే కదా? 

Related Post