పొటాటో అంటే ఉల్లిగడ్డే కదా? ఏపీ సిఎం జగన్‌ ప్రశ్న

December 08, 2023
img

ఓ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న వ్యక్తికి బంగాళదుంపలకు ఉల్లిపాయలకు తేడా తెలీదంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ సిఎం జగన్మోహన్‌ రెడ్డి శుక్రవారం తిరుపతి జిల్లాలోని బాలిరెడ్డిపల్లెలో మిగ్‌జామ్ తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తూ బాధితులకు తమ ప్రభుత్వం అందిస్తున్న నిత్యావసర సరుకుల జాబితాని చదివారు. మద్యలో ఒక కేజీ ఆనియన్ (ఉల్లిపాయలు), ఒక కేజీ పొటాటో (దుంపలు) అంటూ... వెనక్కు తిరిగి అధికారులతో పొటాటో అంటే ఉల్లిగడ్డలే కదా?అని ప్రశ్నించడంతో సభకు వచ్చినవారందరూ ఫక్కున నవ్వారు. అధికారులు పొటాటో అంటే తెలుగులో ‘బంగాళదుంపలు’ అని చెప్పినప్పటికీ బంగాళదుంపలని పలకలేక తడబడుతుంటే, మళ్ళీ అందరూ మూసిముసి నవ్వులు నవ్వారు. 

ఒక్కో రాష్ట్రం, ఒక్కో జిల్లాలో నిత్యావసర సరుకులను వేర్వేరు పేర్లు ఉండటం సహజమే. కానీ దుంపలు, ఉల్లిపాయలు వేర్వేరని అందరికీ తెలుసు కానీ ముఖ్యమంత్రికి తెలియకపోవడమే విచిత్రంగా ఉంది.

పొటాటో అంటే బంగాళ దుంపలని అధికారులు చెప్పిన్నా దానిని సరిగ్గా పలకలేక తడబడటం మరీ విడ్డూరంగా ఉంది. జగన్‌ ఎంత ఇంగ్లీష్ మీడియంలో చదువుకొన్నప్పటికీ రాయలసీమకు చెందినవారే. పైగా ప్రతీరోజూ ఉల్లిపాయలు, దుంపలు కూరల్లో తింటూనే ఉంటారు. అయినా తెలుగులో దుంపలేవో ఉల్లిపాయలేవో తెలియకపోవడం చాలా విడ్డూరంగా ఉంది.

కూరగాయలు పేర్లే తెలియనప్పుడు ఇక వ్యవసాయం, రైతుల సమస్యల గురించి ఏం తెలుస్తుంది?అని ప్రతిపక్ష నేతలు ఎద్దేవా చేస్తున్నారు.

Related Post