హైదరాబాద్‌కు మరో పర్యాటక ఆకర్షణ కేంద్రం

September 19, 2023
img

గత ఏడు దశాబ్ధాలలో హైదరాబాద్‌ నగరంలో జరిగిన అభివృద్ధి కంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ 9 ఏళ్ళలోనే కేసీఆర్‌ నేతృత్వంలో బిఆర్ఎస్‌ ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధి అనేక రెట్లు ఎక్కువని చెప్పక తప్పదు. నానాటికీ పెరుగున్న నగర జనాభా, ట్రాఫిక్‌ని దృష్టిలో ఉంచికొని తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో అనేక ఫ్లైఓవర్లు, రోడ్లు నిర్మిస్తూనే ఉంది. 

వాటితో పాటు నగర సుందరీకరణ పనులు సమాంతరంగా చేస్తోంది. హైదరాబాద్‌ అంటే ఇదివరకు ఛార్మినార్, గోల్కొండ కోట, టాంక్‌ బండ్‌ మాత్రమే గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు హైదరాబాద్‌ నగరంలో అనేక పర్యాటక ఆకర్షణ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. 

తాజాగా జలవిహార్ సమీపంలో హుస్సేన్ సాగర్ తీరాన్న ప్రభుత్వం కొత్తగా ‘లేక్ ఫ్రంట్ పార్క్’ని నిర్మించింది. పార్కులో ఆహ్లాదం కలిగించే పచ్చటి మొక్కలు, వాటి మద్య వాకింగ్ ట్రాక్, హుస్సేన్ సాగర్‌ నీళ్ళపై సుమారు 20-30 అడుగులు పొడవునా వ్రేలాడే అందమైన ఇనుప వంతెన వంటివి ఇంకా చాలా ఏర్పాటు చేశారు. త్వరలోనే ఈ కొత్త పార్కు ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలియజేస్తూ మంత్రి కేటీఆర్‌ ఆ పార్క్ వీడియోని ట్విట్టర్‌లో షేర్ చేశారు.    

Related Post