పోలీస్ జంట ప్రీ-వెడ్డింగ్ షూట్: కమీషనర్ ఏమన్నారంటే

September 18, 2023
img

హైదరాబాద్‌లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో పోలీస్ ఇన్‌స్పెక్టర్లుగా చేస్తున్న ఓ యువజంట త్వరలో పెళ్లి చేసుకొనున్నారు. కనుక తమ ప్రీ-వెడ్డింగ్ ఫోటో షూట్ కాస్త వెరైటీగా చేయాలనుకొన్నారు. వారిరువురూ తాము పనిచేస్తున్న పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తమ పోలీస్ వాహనాలలో యూనిఫారంలో వచ్చి అక్కడ కొన్ని సన్నివేశాలలో నటించిన తర్వాత ఛార్మినార్ వద్దకు వెళ్ళి అక్కడా సినిమా సన్నివేశాలను తలపిస్తూ రొమాన్స్ చేశారు. ఆ తర్వాత ఓ చెరువు గట్టు వద్ద డాన్సులు కూడా చేశారు.

అవి సోషల్ మీడియాలోకి అప్‌లోడ్‌ చేయడంతో ప్రశంశలు, విమర్శలు, కామెంట్స్ మొదలయ్యాయి. కొందరు వారి చర్యను తప్పు పట్టగా, ఇద్దరూ చాలా చక్కగా చేశారని మెచ్చుకొన్నారు. అయితే నగర పోలీస్ కమీషనర్ సివి ఆనంద్ మాత్రం వారిని సున్నితంగా మందలిస్తూ ఇకపై ఎవరూ ఈవిదంగా చేయవద్దని హెచ్చరించారు. 

పెళ్ళి చేసుకోబోతున్నామనే సంతోషంతో ఇద్దరూ కాస్త అతి చేశారని, ముందుగా అనుమతి తీసుకొని ఉంటే బాగుండేదని అన్నారు. పోలీస్ ఉద్యోగం చాలా కష్టంతో కూడుకొన్నదని, ముఖ్యంగా మహిళలకు ఇంకా కష్టంగా ఉంటుందని, కనుక పెళ్ళికి సిద్దపడుతున్న ఆ పోలీస్ జంటకు శుభాకాంక్షలు తెలియజేసి, వారి పెళ్ళికి తాను తప్పకుండా హాజరయ్యి ఆశీర్వదిస్తానని ఆనంద్ చెప్పారు. 

(Video Courtecy: Deccan Chronicle_

Related Post