కొడుకులు పట్టించుకోవడంలేదని భర్తకు ఇంట్లోనే దహనం!

May 29, 2023
img

 ఏపీలోని కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో సోమవారం ఉదయం తీవ్ర విషాద ఘటన జరిగింది. స్థానికంగా మెడికల్ షాప్ నడిపించుకొంటున్న పోతుగంటి హరికృష్ణ ప్రసాద్ (60) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇంట్లోనే ఉంటున్నారు. ఈరోజు ఉదయం ఆయనకు గుండెపోటు వచ్చి చనిపోయారు. ఆయన భార్య పేరు లలితకుమారి. వారి పెద్ద కుమారుడు దినేష్ కర్నూలులోనే ఓ ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తుండగా, చిన్న కుమారుడు ముఖేష్ కెనడాలో స్థిరరపడ్డాడు. 

అయితే కుమారులిద్దరూ తమను పట్టించుకోకుండా ఆస్తి కోసం గొడవపడుతున్నారని, తండ్రి చనిపోయడని తెలిస్తే ఆస్తి కోసం గొడవపడతారని భావించి, ఇంట్లోనే భర్త శవానికి న్యూస్ పేపర్లు, బట్టలు, కొబ్బరి పీచు, పాత అట్టపెట్టెలు వగైరాలతో నిప్పు పెట్టేసి బయటకు వచ్చి కూర్చోన్నారు. 

ఇంట్లో నుంచి పొగలు వస్తుండటంతో అగ్నిప్రమాదం జరిగిందని భావించి స్థానికులు పోలీసులకు ఫోన్‌ చేసి తెలియజేయడంతో వారు అగ్నిమాపక సిబ్బందిని వెంటబెట్టుకువచ్చారు. కానీ అక్కడ జరిగింది చూసి వారు షాక్ అయ్యారు. 

అప్పటికే హరికృష్ణ ప్రసాద్ మృతదేహం పూర్తిగా కాలి బూడిదైపోయింది. మంటలు ఆర్పిన తర్వాత పోలీసులు ఆ ఆస్తికలను స్వాధీనం చేసుకొని, లలిత కుమారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా ఆమె కొడుకులు పట్టించుకోకపోవడం వలననే ఈవిదంగా చేశానని చెప్పారు. అయితే ఆమె మానసిక పరిస్థితి సరిగా లేకపోవడం వలననే ఈవిదంగా చేసి ఉండవచ్చని భావిస్తున్నారు.

Related Post