కూతురు పెళ్ళిలో తండ్రి మృతి... గోదావరిఖనిలో

May 25, 2023
img

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సింగరేణి కళ్యాణ మండపంలో ఓ విషాద ఘటన జరిగింది. స్థానిక విఠల్ నగర్‌లో ప్రైవేట్ హాస్టల్ నడిపించుకొంటూ కుటుంబాన్ని పోషించుకొంటున్న ఎలిగేటి శంకర్ (54) కూతురు వివాహం జరుగుతుండగా గుండెపోటుతో చనిపోయారు. అయితే చాతిలో కాస్త నొప్పిగా ఉందని సమీప బంధువులకు చెప్పడంతో వారు వెంటనే ఇంటికి తీసుకువెళ్లిపోయారు. ఇంటికి చేరుకొనేసరికి శంకర్ గుండెపోటుతో చనిపోయారు. కానీ ఈ విషయం తెలిస్తే పెళ్ళి ఆగిపోతుందని, ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడుతూ పెళ్ళి వేడుక పూర్తి చేశారు. ఈ విషయం తెలిసిన కొద్దిమంది కంట కన్నీరు చిలుకుతుండగా సంతోషంగా వివాహం చేసుకొంటున్న నూతన వధూవరులను ఆశీర్వదించారు. పెళ్ళి వేడుక పూర్తయిన తర్వాత అందరికీ ఈ విషయం చెప్పడంతో అంతవరకు వేదమంత్రాలు, మంగళవాయిద్యాలు మారుమ్రోగిన కళ్యాణ మండపంలో ఒక్కసారిగా బంధువులు, పెళ్ళి కుమార్తె ఏడుపులతో విషాదఛాయలు అలుముకొన్నాయి. అనంతరం వధూవరుల రెండు కుటుంబాల పెద్దలు కలిసి పెళ్ళి కూతురు తండ్రి అంత్యక్రియలు జరిపించారు. 


Related Post